30 రోజులు.. రూ.750 కోట్లు
ఆస్తిపన్ను ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అధికారులకు ప్రతి నెలా ఎంత వసూలు చేయాలో లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఎర్లీబర్డ్ లక్ష్యాన్ని చేరుకోకపోతే బాధ్యులు చార్మినార్‌కు బదిలీ
పన్నుపై 5 శాతం రాయితీ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ
ఈనాడు, హైదరాబాద్: ఆస్తిపన్ను ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అధికారులకు ప్రతి నెలా ఎంత వసూలు చేయాలో లక్ష్యాన్ని నిర్దేశించింది. శుక్రవారంతో ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,681కోట్ల పన్ను వసూలవగా, వెంటనే 2023-24 ఆర్థిక సంవత్సర పన్ను వసూళ్లపై బల్దియా దృష్టి సారించింది. ఎర్లీబర్డ్(2023-24 సంవత్సరానికి ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5శాతం రాయితీ కల్పించే) పథకాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు అమలు చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. జోన్లు, సర్కిళ్లవారీగా ఎంత పన్ను వసూలు చేయాలనే విషయమై లక్ష్యాన్ని నిర్దేశించింది. ఎవరైనా లక్ష్యం చేరుకోకపోతే వారిని చార్మినార్ జోన్‌కు బదిలీ చేస్తామని ఉన్నతాధికారులు వాట్సప్ గ్రూపులో హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మరీ బాగోలేని అధికారులను.. ఉద్యోగులందరి ముందు నిలదీసే పరిస్థితి వస్తుందని, చర్యలు తీసుకునే పరిస్థితిని తెచ్చుకోవద్దని సూచించారు. ఎర్లీబర్డ్ పథకం గురించి నగరంలోని 13లక్షల మంది యజమానుల ఫోన్ నంబర్లకు సందేశాలు పంపించామని జీహెచ్‌ఎంసీ గుర్తు చేసింది.
ఆస్తిపన్ను ఆదాయంపై అసంతృప్తి
రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించామని, ఎక్కువ ఆదాయ వనరులు ఉన్న ప్రాంతాలతోపాటు ఏ ఒక్క సర్కిల్ కార్యాలయం కూడా 100శాతం వసూళ్లను రాబట్టలేకపోయిందని ఉన్నతాధికారులు శనివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. బల్దియా ఆర్థిక అవసరాలు, వసూళ్లకు పొంతన లేదన్నారు.
ట్రేడ్ లైసెన్సులపై రూ.95 కోట్లు
చిన్నపాటి దుకాణం నుంచి నక్షత్ర హోటళ్ల వరకు ట్రేడ్ లైసెన్సు అవసరం. అయినప్పటికీ ట్రేడ్ లైసెన్సుల జారీలో జీహెచ్‌ఎంసీ చొరవ చూపలేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలో సుమారు 3 లక్షల వాణిజ్య కేటగిరీ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ జారీ చేసిన ట్రేడ్ లైసెన్సులు 1.2లక్షలు మాత్రమే. వ్యాపార సముదాయాలు, దుకాణాలకు లైసెన్సు తీసుకునే విషయమై చైతన్యవంతం చేయట్లేదని, ఆమ్యామ్యాలు తీసుకుని వ్యాపారులకు అండగా నిలుస్తున్నారని ఆరోపణలున్నాయి. గతంతో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ట్రేడ్ లైసెన్సు అధికంగా వసూలైనప్పటికీ.. అందులో రూ.7కోట్లు హరిత నిధి కింద యజమానుల నుంచి వసూలు చేసినవే. హరిత నిధి, ట్రేడ్ లైసెన్సుల రుసుం కలిపితే రూ.95.93కోట్లు వసూలైనట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Crime News
Crime News: క్రికెట్లో వాగ్వాదం.. బ్యాటుతో కొట్టి చంపిన బాలుడు
-
Movies News
నయన చిత్రం.. ప్రతీకార నేపథ్యం
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?