logo

అర్ధరాత్రి హలీమ్‌.. అదే షాన్‌

రంజాన్‌ మాసంతోపాటే నగరంలో హలీమ్‌ సందడి మొదలైంది. విభిన్న రుచులతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు వినూత్నంగా హలీమ్‌ వంటకాలను పరిచయం చేస్తున్నాయి.

Published : 02 Apr 2023 03:19 IST

హోటళ్లు, రెస్టారెంట్లు కిటకిట
సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు విక్రయాలు
ఈనాడు, హైదరాబాద్‌

రంజాన్‌ మాసంతోపాటే నగరంలో హలీమ్‌ సందడి మొదలైంది. విభిన్న రుచులతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు వినూత్నంగా హలీమ్‌ వంటకాలను పరిచయం చేస్తున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి మొదలుకొని తెల్లవారుజాము వరకు విక్రయాలు జరుపుతుండటంతో నగరవాసులు అర్ధరాత్రి వేళ హలీమ్‌ రుచి చూడటానికి వెళ్తున్నారు. విక్రయ కేంద్రాలు రాత్రిళ్లు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము 4గంటల వరకు రద్దీ ఉంటోంది. హలీమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్న హైదరాబాద్‌లో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి నిర్వాహకులు బాహుబలి, మలాయి, నల్లిగోష్‌ అంటూ వేర్వేరు పసందైన రుచులను ప్రవేశపెడుతున్నారు.

ధరలు పెరిగి..

పాత నగరం, టోలిచౌకి, మాసబ్‌ట్యాంక్‌, కార్ఖానా, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, నాంపల్లి తదితర ప్రాంతాల్లో వేలాది సంఖ్యలో హలీమ్‌ బట్టీలు వెలిశాయి. మినీ, స్పెషల్‌, ఫ్యామిలీ, జంబో ప్యాక్‌పేర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ధరలు భారీగా పెరగడంతో హలీమ్‌ ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మినీ రూ.170 నుంచి 300, స్పెషల్‌ హలీమ్‌ రూ.400 నుంచి రూ.600, ఫ్యామిలీ రూ.750 నుంచి రూ.850, పత్తర్‌ కా ఘోష్‌, చికెన్‌ ఫ్రై, నల్లిగోష్‌, అండా, కబాబ్‌, కాజు, బాదం వంటి విభిన్న ఆహార పదార్థాలతో ఉన్న బాహుబలి హలీమ్‌ సుమారు రూ.1200 వరకు విక్రయిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఏ హలీమ్‌ ప్రత్యేకమంటే..

మాసబ్‌ట్యాంక్‌: నల్లిగోష్‌

ముసారాంబాగ్‌: మలాయి

సికింద్రాబాద్‌: బాహుబలి

లక్డీకాపూల్‌: చికెన్‌ 65

బంజారాహిల్స్‌: స్పెషల్‌ క్రీమ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని