logo

విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు

పండుగల సమయాల్లో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ మురళీధర్‌ హెచ్చరించారు. రానున్న హనుమాన్‌ జయంతి, భద్రేశ్వర జాతర, రంజాన్‌ నేపథ్యంలో పట్టణంలో శనివారం శాంతి సమావేశం నిర్వహించారు.

Published : 02 Apr 2023 03:19 IST

అదనపు ఎస్పీ మురళీధర్‌

శాంతి సమావేశంలో మాట్లాడుతున్న మురళీధర్‌

తాండూరు టౌన్‌: పండుగల సమయాల్లో మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవని అదనపు ఎస్పీ మురళీధర్‌ హెచ్చరించారు. రానున్న హనుమాన్‌ జయంతి, భద్రేశ్వర జాతర, రంజాన్‌ నేపథ్యంలో పట్టణంలో శనివారం శాంతి సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడారు. పండుగ సమయాల్లో అన్ని మతాలు, కులాల వారు ఐకమత్యంతో ఉండాలని చెప్పారు. ప్రశాంతంగా జరగటానికి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. సామాజిక మాధ]్యమాల్లో రెచ్చగొట్టే విధంగా సందేశాలు ప్రచారం చేయవద్దని చెప్పారు. కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు తాటికొండ స్వప్న, ఉపాధ్యక్షురాలు పట్లోళ్ల దీప, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజుగౌడ్‌, హిందు ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి నర్సింహులు, ముస్లిం సంక్షేమ సంఘం ప్రతినిధులు ఖుర్షిద్‌ హుస్సేన్‌, కమల్‌ అత్తర్‌, ఆయా పార్టీల రాజకీయ నాయకులు, డీఎస్పీ శేఖర్‌గౌడ్‌, పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి, గ్రామీణ సీఐ రాంబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని