logo

రెండు నెలల్లో రహదారులు నిర్మించాలి: కలెక్టర్‌

జిల్లాలో పంచాయతీరాజ్‌, రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రహదారి పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు.

Published : 02 Apr 2023 03:19 IST

మాట్లాడుతున్న నారాయణరెడ్డి, అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ

వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో పంచాయతీరాజ్‌, రోడ్ల భవనాల శాఖకు సంబంధించిన రహదారి పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మతో కలిసి సమీక్షించారు. ఇప్పటికే మంజూరైన పనులను తప్పని సరిగా ప్రారంభించాలన్నారు. అన్నింటిని వర్షాకాలంలోపే పూర్తి చేయాలని చెప్పారు. ఇసుక, కంకర సేకరించేందుకు వీలుగా అధికారులకు సూచనలిచ్చామన్నారు. ఉపాధి, మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపట్టిన వాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. జిల్లా, మండల స్థాయిలో వాట్సాప్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా గ్రూప్‌లో కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, గుత్తేదారులను చేర్చాలన్నారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, గుత్తేదారు, తహసీల్దారు, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ ఈఈలు శ్రీనివాస్‌రెడ్డి, లాల్‌సింగ్‌, జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి నిరంజన్‌రావు పాల్గొన్నారు.

* కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులను వారం రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్డీవో అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

జిల్లాలో 1030 గృహాల పంపిణీకి కసరత్తు

వికారాబాద్‌ కలెక్టరేట్‌: జిల్లాలో 1030 రెండు పడక గదుల ఇళ్లను సిద్ధం చేసి, లబ్ధిదారులకు అందిస్తామని కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దృశ్య మాధ్యమంలో  శనివారం మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సోమవారం వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ, ఆర్డీఓ విజయకుమారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని