logo

విజయరామారావుకు ఏ పదవీ శిరోభారం కాలేదు

దివంగత కె.విజయరామారావు ఏ పదవిలో ఉన్నా అది ఆయనకు శిరోభారం కాలేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో విజయరామారావు సంస్మరణ సభ నిర్వహించారు.

Published : 02 Apr 2023 03:19 IST

‘విశ్వనాథ జయంతి’ ప్రత్యేక సంచిక ఆవిష్కరిస్తున్న కేశవరావు, కొండల్‌రావు, మహేందర్‌రెడ్డి,    పాపారావు, ఆంజనేయరెడ్డి చిత్రంలో అన్నపూర్ణ

ఖైరతాబాద్‌: దివంగత కె.విజయరామారావు ఏ పదవిలో ఉన్నా అది ఆయనకు శిరోభారం కాలేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో విశ్వనాథ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో విజయరామారావు సంస్మరణ సభ నిర్వహించారు. ఆయన సేవల్ని వివరిస్తూ రూపొందించిన ‘విశ్వనాథ జయంతి’ ప్రత్యేక సంచికను ఈ సందర్భంగా విడుదల చేశారు. ప్రొ.యాదగిరి అధ్యక్షతన జరిగిన సభలో జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, కేవీఆర్‌ కుమార్తె అన్నపూర్ణ, సాహిత్య పీఠం అధ్యక్షుడు కొండలరావు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి, మెట్రోరైల్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, పౌరహక్కుల సంఘం నేత ప్రొ.హరగోపాల్‌, పలువురు తదితరులు పాల్గొని మాట్లాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు