logo

అగ్గి ముప్పు కట్టడికి ఆధునిక అస్త్రాలు

రాష్ట్రవ్యాప్తంగా వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాల కట్టడికి యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై.నాగిరెడ్డి స్పష్టంచేశారు.

Published : 02 Apr 2023 03:12 IST

అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై.నాగిరెడ్డి

మాట్లాడుతున్న డీజీ నాగిరెడ్డి, అధికారులు పాపయ్య, విజయ్‌కుమార్‌, ధనుంజయరెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాల కట్టడికి యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డీజీ వై.నాగిరెడ్డి స్పష్టంచేశారు. శనివారం అగ్నిమాపక, ప్రకృతి విపత్తుల శాఖ వేసవి సన్నద్ధతపై మాదాపూర్‌ ఫైర్‌ స్టేషన్‌లో ఆర్‌ఎప్‌ఓ పాపయ్య, డీఎఫ్‌వో శ్రీధర్‌రెడ్డి, ఏడీఎఫ్‌వోలు ధనుంజయరెడ్డి, గిరిధర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌తో కలసి డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అగ్నిప్రమాదాలు, భూకంపాలు, వరదలు తదితర ప్రకృతి విపత్తుల్లో ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించేందుకు అనువుగా అగ్నిమాపకశాఖ ఆధునిక సామగ్రి సమకూర్చుకుంటున్నట్లు వివరించారు. అనంతరం మాదాపూర్‌ ఫైర్‌స్టేషన్‌ ఆవరణలో అగ్నిమాపక శాఖ సమకూర్చుకున్న ఆధునిక పరికరాల పనితీరును అధికారులు మీడియాకు వివరించారు. ఫైర్‌స్టేషన్ల వారీగా ప్రతి శుక్రవారం నివాస, వాణిజ్య సముదాయాల తనిఖీలు చేపడుతున్నామన్నారు. మీడియా సమావేశం అనంతరం డీజీ నాగిరెడ్డి, ఉన్నతాధికారులు మాదాపూర్‌లో నిర్మాణంలో ఉన్న 20 అంతస్తుల వాణిజ్య భవన సముదాయాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి గౌలిదొడ్దిలో నిర్మాణంలో ఉన్న గేటెడ్‌ కమ్యూనిటీని పరిశీలించారు. సాయంత్రం వట్టినాగులపల్లిలోని అగ్నిమాపక, ప్రకృతి విపత్తుల శిక్షణ కేంద్రంలో బహుళ అంతస్తుల భవనాల్లో పని చేసే సిబ్బందికి అందిస్తున్న శిక్షణ వివరాలను డీజీ నాగిరెడ్డి వివరించారు.

ప్రదర్శనలో అగ్ని నివారణ పరికరాలు

బ్రాంటో స్కైలిఫ్ట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని