logo

స్టెరాయిడ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

హార్మోన్‌ ఉత్ప్రేరక ఔషధాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసుల సహకారంతో హయత్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు.

Published : 02 Apr 2023 03:12 IST

ప్రసాద్‌,   బాలాజీ

వనస్థలిపురం, హయత్‌నగర్‌: హార్మోన్‌ ఉత్ప్రేరక ఔషధాలను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరిని ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ పోలీసుల సహకారంతో హయత్‌నగర్‌ పోలీసులు పట్టుకున్నారు. శనివారం వనస్థలిపురంలోని తన కార్యాలయంలో ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు.  కర్ణాటకలోని నాందేడ్‌ జిల్లా బిలోలి గ్రామానికి చెందిన బాలజీ ధర్మాజీ పుండుగే(36) హయత్‌నగర్‌లోని ఓ ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని సమీప బంధువు ప్రసాద్‌ గులాబ్‌రావు పుండుగే(23)తో కలిసి ఆసుపత్రిలో లభించే పలు రకాలైన హార్మోన్‌ ప్రేరేపిత మందులు, స్టెరాయిడ్‌లను జిమ్‌కు వెళ్లే, గంజాయికి బానిసలైన యువతను ఆకర్షిస్తూ.. విక్రయించడం ఆరంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి శనివారం నిందితులు ఇద్దరినీ హయత్‌నగర్‌లో అరెస్టు చేశారు. వారి నుంచి వివిధ రకాలైన 30 ఇంజక్షన్లు, రెండు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని