logo

‘బీసీ బిల్లు సాధనకు మిలిటెంట్‌ తరహా పోరాటం’

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బీసీ బిల్లు సాధనకు మిలిటెంట్‌ తరహా పోరాటానికి సైతం వెనుకాడమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Published : 02 Apr 2023 03:12 IST

ఐక్యత చాటుతున్న ఆర్‌.కృష్ణయ్య, బీసీ నేతలు

కాచిగూడ: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లకు ఉద్దేశించిన బీసీ బిల్లు సాధనకు మిలిటెంట్‌ తరహా పోరాటానికి సైతం వెనుకాడమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  బీసీల డిమాండ్ల సాధనకు ఈ నెల 3న పార్లమెంటు వద్ద నిర్వహించనున్న భారీ ప్రదర్శన నేపథ్యంలో శనివారం కాచిగూడలో సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ ఉద్యమాన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నామన్నారు.  సబ్‌ ప్లాన్‌తోపాటు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలను ప్రారంభించాలని కోరారు. నేతలు ఎర్ర సత్యనారాయణ, రాజేందర్‌, అంజి, అనంతయ్య, వేముల రామకృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని