logo

ఉగాది పురస్కారాల ప్రదానం

సృజన భారతి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ సభ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో కనులపండువగా జరిగింది.

Published : 02 Apr 2023 03:12 IST

ఎల్లూరి శివారెడ్డికి పురస్కారం అందజేస్తున్న  డా.కె.వి.రమణాచారి, ఏనుగు నరసింహారెడ్డి, ప్రసాద్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: సృజన భారతి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ సభ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తులో కనులపండువగా జరిగింది. మేడ్చల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌, కవి డా.ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి మాట్లాడుతూ.. పురస్కార గ్రహీతలను అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి(సాహిత్య రంగం), తెలుగు జానపద సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు డా.చింతపల్లి వసుంధరారెడ్డి(జానపద సాహిత్యం), రసమయి అధ్యక్షుడు డా.ఎం.కె.రాము (సాంస్కృతిక రంగం), సారస్వత పరిషత్తు ఉపాధ్యక్షుడు డా.ముదిగంటి సుజాతారెడ్డి(సాహిత్య రంగం), ఓయూ తెలుగు శాఖ విశ్రాంత ఆచార్యులు డా.పాల్వాయి సుమతీ నరేంద్ర(సాహిత్య రంగం), రంగస్థల కళాకారులు వనం శంకరయ్య(రంగస్థల రంగం), కవి, రచయిత నారా కృష్ణమూర్తి(సాహిత్య రంగం), నటుడు, దర్శకుడు మేకా రామకృష్ణ(రంగస్థల రంగం), కవి, రచయిత వెంకటరమణ (సాహిత్య రంగం)లకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. నిర్వాహణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.కొమ్మూరి ప్రసాద్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని