logo

ప్రశ్నపత్రం లీకేజీ కేసు.. రేణుక బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితురాలు రేణుక రాథోడ్‌ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి న్యాయస్థానం శనివారం తిరస్కరించింది.

Published : 02 Apr 2023 03:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితురాలు రేణుక రాథోడ్‌ బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి న్యాయస్థానం శనివారం తిరస్కరించింది. టీఎస్‌పీఎస్సీలో ఏఎస్‌వో ప్రవీణ్‌కుమార్‌ నుంచి అసిస్టెంట్‌ ఇంజినీర్‌(సివిల్‌) ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన కేసులో గత నెల 13న బేగంబజార్‌ పోలీసులు 9 మందిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వీరిలో రేణుక రాథోడ్‌, ఆమె భర్త ఢాక్యా నాయక్‌లు కీలక నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితురాలు రేణుక ఆరోగ్యం సరిగా లేదని, తన ఇద్దరు పిల్లల చదువులు, బాగోగులు పర్యవేక్షించేందుకు సహాయకులు ఎవరూ లేకపోవటంతో బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె తరఫు న్యాయవాది న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉండటం.. బయటకు వస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిట్‌ పేర్కొనటంతో న్యాయస్థానం బెయిల్‌ తిరస్కరించింది. ఈ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న ప్రశాంత్‌రెడ్డి, తిరుపతయ్య, రాజేందర్‌కుమార్‌లను 7 రోజులు కస్టడీకి కోరుతూ సిట్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని