logo

టీఎస్‌పీఎస్సీకి ‘సిట్‌’ నోటీసులు ప్రజలను ఫూల్స్‌ చేయడమే: భాజపా

టీఎస్‌పీఎస్సీ కమిటీకి సిట్‌ నోటీసులు ఇచ్చారనే వార్త ప్రజలను ఫూల్స్‌ చేసేదే అని భాజపా సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు.

Published : 02 Apr 2023 03:12 IST

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ కమిటీకి సిట్‌ నోటీసులు ఇచ్చారనే వార్త ప్రజలను ఫూల్స్‌ చేసేదే అని భాజపా సీనియర్‌ నేత ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన శనివారం నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ కమిటీ సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఒక్క రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే టీఎస్‌పీఎస్సీ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు. తీగ లాగితే డొంక బయటపడుతుందని టీఎస్‌పీఎస్సీ సంస్థ ఛైర్మన్‌ను సీఎం కేసీఆర్‌ ఇంటికి పిలిపించుకుని మాట్లాడారని ఆరోపించారు. రహస్య ప్రాంతంలోకి వెళ్లే అధికారం ఛైర్మన్‌కు కూడా లేదన్నారు. సీక్రెట్‌ గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవా..ఉంటే బయటపెట్టాలన్నారు. పరీక్షలు ఎంత మంది రాశారు, ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే వివరాలపై టీఎస్‌పీఎస్సీపై ఆర్‌టీఐ వేయనున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని