logo

నీటి శుద్ధి నకిలీ పరికరాల విక్రేతల రిమాండ్‌

ప్రముఖ కంపెనీల పేరుతో నీటి శుద్ధి నకిలీ పరికరాలను విక్రయిస్తున్న దుకాణాల బాగోతం బయటపడింది. వీటిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

Published : 02 Apr 2023 03:12 IST

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ప్రముఖ కంపెనీల పేరుతో నీటి శుద్ధి నకిలీ పరికరాలను విక్రయిస్తున్న దుకాణాల బాగోతం బయటపడింది. వీటిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. షాపూర్‌నగర్‌లోని బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఓటీ అదనపు డీసీపీ శోభన్‌తో కలిసి డీసీపీ శ్రీనివాసరావు ఆ వివరాలు వెల్లడించారు. కొన్ని నెలలుగా కూకట్పల్లి, కేపీహెచ్‌బీ ఠాణాల పరిధిలోని శ్రీ శారద ఎంటర్‌ప్రైజెస్‌, బ్లూ ఆక్వా వాటర్‌ సోల్యూషన్స్‌(కేపీహెచ్‌బీ), లింపిడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌(కేపీహెచ్‌బీ) దుకాణాల్లో కెంట్‌, ఆక్వాగార్డ్‌, హెచ్‌యూఎల్‌ సంస్థల పేరుతో నకిలీ వాటర్‌ ఫిల్టర్స్‌ ఫ్యూరిఫయర్లను విక్రయిస్తున్నారు. ఇటీవల ఓ వినియోగదారుడి ఫిర్యాదుతో గుట్టు బయటపడింది. ఈ వ్యవహారంలో మహంకాళినగర్‌కి చెందిన రింకు, శ్రావణ్‌ నిషాద్‌, కేపీహెచ్‌బీ కాలనీవాసులు పామర్తి నాగదాసు, ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ చేశారు. దిల్లీకి చెందిన ప్రదీప్‌ జైన్‌, యాకుబ్‌ పరారీలో ఉన్నారు. పోలీసులు నకిలీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని