logo

Hyd Airport Metro: విమానాశ్రయ మెట్రోకు 9 స్టేషన్లు.. ఎక్కడెక్కడంటే?

రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గంలో మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది.

Updated : 18 May 2023 08:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గంలో మెట్రో స్టేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చింది. టెండర్‌ ప్రక్రియ మొదలు కావడంతో 9 స్టేషన్లను హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రోరైలు (హెచ్‌ఏఎంఎల్‌) సంస్థ ఖరారు చేసింది. రాయదుర్గం వద్ద మొదటి స్టేషన్‌ ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి స్టేషన్లు.. బయోడైవర్సిటీ కూడలి, నానక్‌రాంగూడ కూడలి, నార్సింగి, అప్పా కూడలి, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ పట్టణం, విమానాశ్రయంలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)కు కొద్దిదూరంలో, విమానాశ్రయం టెర్మినల్‌లో భూగర్భ మెట్రోస్టేషన్‌తో ముగుస్తాయి.

భవిష్యత్తులో మరో 4 ఏర్పాటు చేసుకునేలా..

వంపులు లేనిచోట స్టేషన్లు నిర్మిస్తారు. ఏవైనా అడ్డంకులు ఎదురైతే గుత్తేదారుకు మార్పులు, చేర్పులకు అవకాశం ఉండేలా స్టేషన్ల మార్కింగ్‌ ఉండనుంది. మెట్రో ప్రయాణ వేగం, బ్రేకింగ్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని ఖరారు చేస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం మరో 4 స్టేషన్లు ఏర్పాటు చేసుకునేలా అలైన్‌మెంట్‌ను డిజైన్‌ చేశారు. భవిష్యత్తులో నార్సింగి, అప్పాకూడలి మధ్య మంచిరేవుల వద్ద ఒక స్టేషన్‌ వచ్చే అవకాశం ఉంది. అప్పాకూడలి, రాజేంద్రనగర్‌ మధ్యలో కిస్మత్‌పూర్‌లోనూ అదనపు స్టేషన్‌కు అవకాశం ఉంది. రాజేంద్రనగర్‌ నుంచి శంషాబాద్‌ పట్టణం మధ్యలో చాలా దూరం ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఎక్కువ సంస్థలున్నాయి. జనావాసాలు విస్తరిస్తే ఇక్కడ కూడా స్టేషన్‌ వచ్చే సూచనలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని