అడిగేదెవరు.. ఆపేదెవరు..!
జిల్లాలో కాగ్నా, కాకరవేణి నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ ఆపు లేకుండా పోతోంది. రోజూ వారీగా రూ.లక్షల విలువ చేసే ఇసుకను కొల్లగొడుతూ జేబులు నింపేసుకుంటున్నారు.
యథేచ్ఛగా ఇసుక దందా
రూ.లక్షల్లో దోచేస్తున్న అక్రమార్కులు
కాగ్నానదిలో అనుమతి పేరిట ఇసుక తవ్వకాలు
న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్, పరిగి: జిల్లాలో కాగ్నా, కాకరవేణి నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డూ ఆపు లేకుండా పోతోంది. రోజూ వారీగా రూ.లక్షల విలువ చేసే ఇసుకను కొల్లగొడుతూ జేబులు నింపేసుకుంటున్నారు. అక్రమార్కులు ఒక్కో ట్రాక్టరుకు రోజుకు రూ.3000 చొప్పున కొందరు అధికారులకు చెల్లిస్తున్నారని బహిరంగంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇసుక సంరక్షణ, నదీ జలాల నిలుపుదల అవసరంపై ‘న్యూస్‌టుడే’ కథనం.
అండదండలు ఉన్నాయనే ధీమా..
ఇసుకను కొల్లగొడుతున్న వారికి రాజకీయ అండదండలు ఎక్కువగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. కొందరు నేతలు తమ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను తెప్పించుకుంటున్నారు. ఈ వ్యవహారం కూడా అక్రమార్కులకు కలిసి వస్తోంది. ఇసుకతో వెళుతున్న ట్రాక్టర్లను ఎవరైనా అడ్డగించే ప్రయత్నం చేస్తే నేతల పేర్లను చెబుతున్నారు.దీంతో పోలీసులూ వదిలేస్తున్నారు. తమను అడిగే వారు లేరంటూ రాత్రి 12గంటల నుంచి ఉదయం 6గంటల వరకు యథేచ్చగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
రూ.9 లక్షల నుంచి రూ.12లక్షల పైనే
కాగ్నా, కాకర వేణి నదుల్లోంచి ప్రతి రోజు అనధికారిక అంచనా ప్రకారం రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షలకు పైబడి విలువ చేసే ఇసుక దందా జరుగుతోంది. ట్రాక్టరు ఇసుకను రూ.3000పై బడి విక్రయిస్తున్నారు. ప్రతి రోజు 300 నుంచి 400 ట్రిప్పుల ఇసుకను కొల్లగొడుతున్నారు. మరికొందరు ఒక్కో లారీ ఇసుక వద్ద రూ.20 వేల నుంచి రూ.30వేల వరకు సంపాదిస్తున్నారు.
కొరవడిన పర్యవేక్షణ
అధికారికంగా సాగే ఇసుక అమ్మకాలను కూడా వ్యాపారులు అక్రమంగా మలుచుకుంటున్నారు. ట్రాక్టరు ఇసుకకు రూ.600 చెల్లించి అధికారులు సూచించిన ప్రదేశం నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తరలించవచ్చు. అధికారుల పర్యవేక్షణ సవ్యంగా లేక పోవడంతో ట్రాక్టర్ల డ్రైవర్లు వేకువ జామునే నదుల్లోకి ట్రాక్టర్లతో వచ్చి ముందుగా మాట్లాడుకున్న భవన నిర్మాణ యజమానుల ఇళ్ల వద్దకు ఇసుకను తరలిస్తున్నారు.
ఏదీ పోలీసుల కట్టడి
బషీరాబాద్ మండలంలో ప్రవహించే కాగ్నానది నుంచి కర్ణాటక వ్యాపారులు గతేడాది డిసెంబరులో ఇసుక దందా చేశారు. అడ్డుకోబోయిన కానిస్టేబుల్‌పై ట్రాక్టర్‌తో ఢీకొట్టి గాయపరిచారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు రిమాండ్‌కు పంపించారు. తర్వాత తనిఖీలు లేక పోవడంతో దందా యథావిధిగా సాగిపోతోంది.
* పాత తాండూరు సమీపంలోని కాగ్నానదికి అడ్డంగా నిర్మించిన చెక్‌డ్యాంలో ఇసుక తరలించేందుకు గత మార్చిలో ఆనకట్టను ధ్వసం చేయడంతో స్థానికులు, నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నామమాత్రంగా కేసును నమోదు చేసిన పోలీసులు పట్టించుకోవడం మానేశారు. తామేమి చేసినా ఎవరూ పట్టించుకోరనే ధైర్యంతోనే ఆనకట్ట దిగువ నుంచి ఇసుకను ప్రస్తుతం రాత్రి కాగానే యథేచ్చగా కొల్ల గొడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఇసుక పూర్తిగా మాయమైపోతుందనీ, పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Elon Musk: మస్క్ తనయుడికి సందేహం.. దిల్లీ పోలీసుల రిప్లయ్!
-
India News
Wrestlers protest: బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాల్సిందే.. లేదంటే..: రాకేశ్ టికాయత్ హెచ్చరిక
-
General News
Viveka Murder case: సునీత పిటిషన్‌పై విచారణ ఈనెల 5కి వాయిదా
-
General News
Ts News: దిల్లీలోని తెలంగాణ భవన్లో యువతి ఆత్మహత్యాయత్నం
-
Movies News
Raveena Tandon: సూపర్‌హిట్ రెయిన్ సాంగ్.. అక్షయ్ ముద్దు పెట్టకూడదని షరతు పెట్టా: రవీనా టాండన్
-
India News
Manish Sisodia: సిసోదియాకు స్వల్ప ఊరట.. భార్యను చూసొచ్చేందుకు అనుమతి