logo

Hyderabad: నువ్వు చనిపో.. మరో పెళ్లి చేసుకుంటా భర్త వేధింపులు

నువ్వు చనిపో.. మరో యువతిని పెళ్లి చేసుకుంటే భారీగా కట్నం వస్తుందని ఓ భర్త భార్యకు నిత్యం నరకం చూపిస్తున్నాడు.

Updated : 26 May 2023 07:55 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: నువ్వు చనిపో.. మరో యువతిని పెళ్లి చేసుకుంటే భారీగా కట్నం వస్తుందని ఓ భర్త భార్యకు నిత్యం నరకం చూపిస్తున్నాడు. చిత్రహింసలు భరించలేక భార్య అతి కష్టం మీద స్వదేశానికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. శంషాబాద్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎ.శ్రీధర్‌ కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. శంషాబాద్‌ మండలానికి చెందిన యువతి(32)తో శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్‌రెడ్డికి 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన దంపతులు అమెరికాకు వెళ్లారు. వారికి ఓ  బాబు ఉన్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం ప్రవీణ్‌రెడ్డి భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అదనపు కట్నం  ఇవ్వకపోవడంతో పలుమార్లు దాడి చేసి ఆమెకు భోజనం, మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించి భయభ్రాంతులకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని