logo

TS EAMCET: సరదాకు ఎంసెట్‌ రాస్తే.. పదో ర్యాంకు వచ్చింది!

పలు పోటీ పరీక్షలు రాస్తే అనుభవం వస్తుందనే ఉద్దేశంతో ఎంసెట్‌ రాసి పదోర్యాంక్‌ సాధించాడు కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ.

Updated : 26 May 2023 08:51 IST

హిమాయత్‌నగర్‌, న్యూస్‌టుడే: పలు పోటీ పరీక్షలు రాస్తే అనుభవం వస్తుందనే ఉద్దేశంతో ఎంసెట్‌ రాసి పదోర్యాంక్‌ సాధించాడు కొల్లాబత్తుల ప్రీతం సిద్ధార్థ. హిమాయత్‌నగర్‌కు చెందిన ప్రీతం ఇటీవల నీట్‌ రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా ఎంసెట్‌కు సైతం సిద్ధమయ్యాడు. అనుకోకుండా పదో ర్యాంక్‌ వచ్చింది. అయితే, తన అంతిమ లక్ష్యం వైద్య విద్యను అభ్యసించడమేనన్నాడు. ఇతని తండ్రి హర్షవర్ధన్‌ న్యూరోసర్జన్‌, తల్లి శాంతి గైనకాలజిస్టు కావడంతో తల్లిదండ్రుల అడుగుజాడల్లో నడవాలను కుంటున్నట్లు చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని