logo

డ్రగ్స్‌ విక్రయించేందుకు యత్నం.. ఇద్దరు అరెస్టు

నగరంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 26 May 2023 17:17 IST

హైదరాబాద్‌: నగరంలో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ఇద్దరిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియన్ చుక్వేమెక, ముంబైకి చెందిన సోహైల్ అహ్మద్ హసన్ షేక్‌ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్ అదనపు డీసీపీ రమణా రెడ్డి మీడియాకు వివరించారు.

డీసీపీ మాట్లాడుతూ.. ‘‘నిందితులు ఇద్దరూ ముంబైలో ఉండేవారు. డ్రగ్స్ అమ్మేందుకు హైదరాబాద్‌లో వచ్చారు. ఈ ఇద్దరూ రైలులో హైదరాబాద్ వస్తున్నట్లు పక్కా సమాచారం ఉంది. ముందస్తు సమాచారం మేరకు ముందుగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద సోహైల్ అహ్మద్‌ని పట్టుకున్నాం. సోహైల్ ఇచ్చిన సమాచారం మేరకు చుక్వేమెకని లక్డీకపూల్‌లో అరెస్టు చేశాం. రూ. 5లక్షల విలువైన 60 గ్రాముల మెపిడ్రోన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నాం. వీళ్ల నెట్‌వర్క్ ఎంటి?ఎవరికి విక్రయించాలని అనుకున్నారు? వీళ్ల టార్గెట్ ఏ సెక్టార్ అనేది విచారణలో తేలుతుంది’’ అని డీసీపీ తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు