ఓటరు జాబితాలో తప్పులు రావొద్దు : కలెక్టర్
ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా మనసుపెట్టి పనిచేయాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి సూచించారు.
మాట్లాడుతున్న కలెక్టర్ నారాయణరెడ్డి
వికారాబాద్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఓటరు జాబితాలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా మనసుపెట్టి పనిచేయాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపు, ఇంటింటి సర్వే తదితర అంశాలపై తహసీల్దార్లతో సమీక్షించారు. సోమవారం సంబంధిత బూత్ స్థాయి అధికారులకు ఓటరు జాబితా రూపొందించటంపై శిక్షణ ఇవ్వాలన్నారు. సక్రమంగా విధులు నిర్వహించని బీఎల్‌ఓలను వెంటనే మార్చాలని తెలిపారు. వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్‌శర్మ, శిక్షణ కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్‌ఓ అశోక్‌కుమార్, ఆర్డీఓ విజయకుమారి పాల్గొన్నారు.
వైద్య కళాశాల భవన నిర్మాణం వేగవంతం
వికారాబాద్-అనంతగిరిలో కొనసాగుతున్న వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు చివరి దశకు వచ్చాయని జిల్లా పాలనాధికారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా, వైద్య విద్య, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఉన్నతాధికారులతో కలిసి దృశ్య మాధ్యమ ద్వారా జిల్లా కలెక్టర్లతో, సంబంధిత వైద్య, ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలో కొనసాగుతున్న వైద్య కళాశాల భవ నిర్మాణ పనుల గురించి వివరించారు. ఆసుపత్రి మొదటి అంతస్తు పనులు పూర్తికాగా రెండో అంతస్తు పనులు జూలై 15 వరకు పూర్తవుతుందని తెలిపారు. వైద్య విద్య విద్యార్థుల కోసం వసతిని కల్పించేందుకు క్షయ చికిత్సాలయంలో పాత భవనాల మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ అశోక్‌కుమార్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ డీఈ లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Social Look: అభిమానులను మిస్ అయిన నివేదా.. చాట్ చేసేందుకు నర్గిస్ వెయిటింగ్!
-
Viral video: థార్‌లో ప్రయాణిస్తూ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నది దాటేందుకు యత్నం.. వీడియో వైరల్!
-
TMC: మా ఎంపీలు, మంత్రులపై దిల్లీ పోలీసులు చేయి చేసుకున్నారు: తృణమూల్ కాంగ్రెస్
-
Crime News: నిర్మాత అంజిరెడ్డి హత్యను ఛేదించిన పోలీసులు
-
Team India: టీమ్ఇండియా ఆటగాళ్ల రీల్.. కోహ్లీ లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న అభిమానులు
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/10/2023)