‘సీతన్నపేట గేట్’ వద్ద
వేణుగోపాల్, యశ్వన్, సురభి తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతన్నపేట గేట్’. వై.రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు.
వేణుగోపాల్, యశ్వన్, సురభి తివారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతన్నపేట గేట్’. వై.రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.పర్సు స్వరకల్పనలోని ఈ చిత్ర గీతాల్ని ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. దర్శకులు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘అభిరుచి ఉన్న నిర్మాత ఆర్.శ్రీనివాస్. ఆయన కన్నడలో మంచి చిత్రాలు తీస్తూ అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులోనూ వరుసగా సినిమాలు చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక మంచి కథకి వాణిజ్యాంశాల్ని జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేమ నేపథ్యంతో కూడిన ఓ యాక్షన్ కథా చిత్రమిది. తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘మంచి ప్రయత్నంతో వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చే ఓ మంచి చిత్రం అవుతుందని నమ్ముతున్నా’’ అన్నారు నిర్మాత ఆర్.శ్రీనివాస్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్‌పోల్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!