అభివృద్ధి, క్రీడలను అవమానించేలా కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, క్రీడల విషయంలో రాష్ట్రాన్ని అవమానించేలా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
సీఎం కప్-2023 ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
టోర్నమెంట్‌లో భాగంగా టాస్ వేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, క్రీడల విషయంలో రాష్ట్రాన్ని అవమానించేలా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి డా.వి.శ్రీనివాస్‌గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం సీఎం కప్(తెలంగాణ క్రీడా సంబురాలు) పోటీలను ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాట్స్) ఛైర్మన్ డా.ఆంజనేయగౌడ్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శనివారం పరేడ్ గ్రౌండ్‌లో కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా రాష్ట్రానికి పేరు తెచ్చేలా, దేశానికి ఆదర్శంగా ఉండేలా ఉంటాయన్నారు. దేశానికి క్రీడాకారులు కరవయ్యారని, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి కామన్‌వెల్త్, ఒలింపిక్‌లలో పతకాలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొత్తగా 60 స్టేడియాలు, 16 వేల క్రీడాప్రాంగణాలు నిర్మించుకున్నామన్నారు. కామన్‌వెల్త్ దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం లేదని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇదివరకు రూ.20, రూ.30 లక్షల నగదు బహుమతి అందజేసేవారని, నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.2 కోట్ల వరకు ఇస్తున్నారని వివరించారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా క్రీడాకారులకు ఇలాంటి ప్రోత్సాహం ఉందా అని అడిగారు. కార్యక్రమంలో శాట్స్ ఓఎస్డీ డా.లక్ష్మి, డిప్యూటీ డైరెక్టర్లు సుజాత, ధనలక్ష్మి, స్టేడియం అడ్మినిస్ట్రేటర్ రవి, పీడీ, పీఈటీలు పాల్గొన్నారు.
10 వేల మంది క్రీడాకారులు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు గ్రామ, జిల్లా స్థాయిలో జరిగాయి. జిల్లా స్థాయిలో విజేతలైన జట్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నాయి. ఒక్కో జిల్లా నుంచి 18 ఈవెంట్లు, 18 జట్లు ఇక్కడ పాల్గొంటున్నాయని శాట్స్ ఛైర్మన్ డా.ఆంజనేయగౌడ్ తెలిపారు. నగరంలోని ఆరు స్టేడియాల్లో 18 క్రీడాంశాల్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. 29న సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ సభకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
PM Modi: మహబూబ్‌నగర్ చేరుకున్న ప్రధాని మోదీ
-
PM Modi: చీపురు పట్టి.. చెత్తను ఎత్తి.. ప్రధాని మోదీ శ్రమదానం!
-
Team India: అప్పుడు యువీ.. మరి ఇప్పుడు
-
Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్ణాటకలో భారీ బైక్ ర్యాలీ
-
Indigo: హైదరాబాద్ నుంచి బయల్దేరిన విమానంలో ప్రయాణికుడి వింత ప్రవర్తన.. ఏం చేశాడంటే?
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి