పేదోడికి గూడు.. ఇంకెప్పుడు?
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికే పూర్తయిన దాదాపు 65 వేలకు పైగా ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు పంపిణీ చేయమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
సిద్ధంగా 65వేలకు పైగా డబుల్ ఇళ్లు
మంత్రి ఆదేశించినా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయని అధికారులు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ విషయంలో అడుగు ముందుకు పడడం లేదు. ఇప్పటికే పూర్తయిన దాదాపు 65 వేలకు పైగా ఇళ్లను తక్షణం లబ్ధిదారులకు పంపిణీ చేయమని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభం సమయంలో ఈ ఫైలు మీదే సంతకం చేశారు. అధికారులు మాత్రం ఇప్పటివరకు ఒక్కరికి కూడా వీటిని పంపిణీ చేయలేదు. కనీసం లబ్ధిదారుల ఎంపికను కూడా పూర్తి చేయలేదు. సందట్లో సండేమియా అన్నట్లుగా ఇప్పటికే పూర్తయిన ఇళ్లలో అనేకచోట్ల తలుపులు, బాత్రూం సామగ్రి పట్టుకుపోవడంతో ఉన్నతాధికారులు తలలు పట్టుకున్నారు.
మరో రూ.2800 కోట్లు ఇస్తేనే మిగిలినవి
మొత్తం మూడు జిల్లాల పరిధిలో 70 వేల ఇళ్లు పూర్తి కాగా.. 30 వేల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. వీటిని పూర్తి చేయాలంటే ఇంకా రూ.2800 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు నిధుల బకాయిలు ఉండటంతో గుత్తేదారులు పనులు నిలిపివేశారు. ఈ పనులన్నీ 2016-17 ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం చేపట్టారు. ఇప్పుడు ఇసుక, సిమెంట్, స్టీలు రేట్లు విపరీతంగా పెరగడంతో.. ఈ పెరిగిన ధరలను తమకు వర్తింప చేస్తేనే పనులు మొదలుపెడతామని గుత్తేదారులు చెబుతున్నారు. ఈ రేట్లను వర్తింపు చేయాలంటే మరో రూ.600 కోట్లను గుత్తేదారులకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని సీనియర్ ఇంజనీర్ ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత పెద్దఎత్తున నిధుల విడుదల సాధ్యమా అన్నది ప్రశ్న? ఈ 30 వేల ఇళ్లలో 90 శాతం పనులు జరిగిన వాటిలో మిగిలిన పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ఉన్నారు. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన ముగించుకుని ఇక్కడకు వచ్చిన తరువాతే రెండు పడక గదుల ఇళ్ల పంపిణీపై పూర్తిస్థాయిలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
అసాంఘిక శక్తులకు అడ్డాలుగా..
ఈ ఏడాది చివర్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మహానగరం పరిధిలో నిర్మించిన లక్ష డబుల్ బెడ్‌రూం ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే లక్షలాదిమంది వీటి కోసం దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తులను కొంతమేర క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలన కూడా చేశారు. ఇందులో అర్హులను గుర్తించాల్సి ఉంది. వీరిలో తుది లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదంతా జరగడానికి కనీసం రెండు నెలలు పడుతుందని అంటున్నారు. ఈ బాధ్యతను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు. రెవెన్యూ అధికారులు దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. పూర్తయిన ఇళ్లు నెలల తరబడి ఖాళీగా వదిలేయడంతో అనేకచోట్ల ఇళ్ల తలుపులను, ప్లంబింగ్ సామాన్లు కొంతమంది ఎత్తుకెళ్లి అమ్ముకున్నారు. కొన్ని ఇళ్లు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి.
నగరంలో మొత్తం పూర్తయిన ఇళ్లు 70 వేలు
ఇప్పటివరకు పంపిణీ చేసినవి 4100
పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 65900
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asia cup: జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనాకు ఒడిశా బంపర్ ఆఫర్!
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్