టీ-24, టీ-6తో ఆర్టీసీకి పెరిగిన రద్దీ
ప్రయివేటు వాహనాల్లో గమ్యస్థానాలను చేరుకునే ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన టీ-24, టీ-6 పాస్ స్కీమ్‌లు సత్ఫలితాలనిస్తున్నాయి.
ఈనాడు, హైదరాబాద్: ప్రయివేటు వాహనాల్లో గమ్యస్థానాలను చేరుకునే ప్రయాణికులను ఆకర్షించేందుకు తీసుకొచ్చిన టీ-24, టీ-6 పాస్ స్కీమ్‌లు సత్ఫలితాలనిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో నాలుగైదు గమ్యస్థానాలను చేరుకునే వెసులుబాటు ఉండటంతో డే-పాస్‌లు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చి నుంచి గమనిస్తే మే 28 నాటికి సగటున 40 నుంచి 55శాతం వృద్ధి కనిపిస్తోంది. మార్చి 31 నాటికి సగటున రోజుకు 1,994 మంది ప్రయాణించగా మే 28 నాటికి ఆ సంఖ్య 4,533కి పెరిగింది.
* వేసవిలో సాధారణ ప్రయాణికుల సౌకర్యార్థం రూ.100 ఉండే టీ-24 టికెట్‌పై 10శాతం రాయితీని కల్పించి రూ.90 చేసింది. కొత్తగా సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడినవారికి) రూ.80కే అందిస్తుండగా..సగటున రోజుకు 32,218 మంది ప్రయాణిస్తున్నారు. మార్చిలో ప్రయాణించిన వారితో పోల్చితే ఈ సంఖ్య 50శాతం పెరిగినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఎఫ్-24తో పెరుగుతున్న ఆదరణ
ఎఫ్(ఫ్యామిలీ)-24 టికెట్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. రూ.300 చెల్లించి కుటుంబ సభ్యులు, బంధువులు (నలుగురు) కలిసి రోజంతా నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా 24గంటల పాటు ప్రయాణించొచ్చు. మార్చి నెలలో గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో మొత్తం 2,386 మంది ఈ టికెట్ కొనుగోలు చేయగా మే నెలలో 5,860 మంది ప్రయాణించారు. ఈ లెక్కన మార్చి నెలలో సగటున రోజుకు 298 ఉండగా, మే నెలాఖరుకు 651కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనాకు ఒడిశా బంపర్ ఆఫర్!
-
Pakistan: అఫ్గాన్ సైనికుడి కాల్పులు.. ఇద్దరు పాక్ పౌరులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Vande Bharat: కాషాయ రంగులో ‘వందేభారత్’.. రైల్వే మంత్రి వివరణ ఇదే!
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్