హార్మోన్లపై ప్రభావం.. మానసిక కల్లోలం
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది.
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది. శరీరంలోని సోడియం, పొటాషియం ఇతర లవణాలు తగ్గి చివరికి మానసిక కల్లోలానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటినే సీజనల్ ఎఫెక్ట్ డిజార్డర్స్‌గా వ్యవహరిస్తారు.
* రుతువులు మారిన ప్రతిసారి ఆ ప్రభావం జీవులపై పడుతుంది. సాధారణంగా చలికాలంలో కొందరు కుంగుబాటుకు లోనవుతారు. వేసవిలోనూ కొన్ని రకాల మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో పగటి సమయం ఎక్కువ. అందుకు తగ్గట్లు శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కొందరిలో హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇదే మానసిక సమస్యలకు దారి తీస్తుంది.
* కొందరి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎక్కువ మాట్లాడటం.. పాటలు పాడటం.. నృత్యాలు చేయడం.. పనులు ఎక్కువ చేయడం లాంటి లక్షణాలు వీరిలో కన్పిస్తుంటాయి. ఇవి మరీ ఎక్కువైతే ఇతర సమస్యలకు దారితీస్తాయి.
* ఇలాంటి లక్షణాలు ఉంటే ఎండలో తిరగడం తగ్గించాలి. వీలైతే చల్లని ప్రాంతాల్లో ఉండేలా చూడాలి.ఎక్కువ కాంతి ఉన్న లైట్లు శరీరం, ముఖంపై పడకుండా చూసుకోవాలి.
* ఎండలో తిరగడం వల్ల శరీరం నుంచి అదే పనిగా చెమట రూపంలో నీళ్లు పోతుంటాయి. ఇదే సమయంలో ఎలక్ట్రోలైట్స్ అయిన సోడియం, పొటాషియం ఇతర మూలకాలను శరీరం కోల్పోతుంది. ఈ ప్రభావం ఒక్కసారిగా మెదడుపై పడుతుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. ఇవే మానసిక సమస్యలకు కారణమవుతాయి.
* చిరాకుగా మాట్లాడటం, పెద్దపెద్ద శబ్దాలు విన్పిస్తున్నట్లు భ్రమించడం, కుటుంబ సభ్యులను గుర్తించకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ పరిస్థితి కన్పిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించడం మంచిది.
* నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం లాంటివి తీసుకుంటూ ఉంటే ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా చూసుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Karnataka: ఇలాగే వదిలేస్తే కర్ణాటకలో కసబ్, లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తారు: భాజపా నేత సీటీ రవి
-
Asian Games: ఆసియా క్రీడలు.. నీరజ్‌కు స్వర్ణం, కిశోర్‌కు రజతం
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్