logo

ధరణి పోర్టల్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: కోదండరెడ్డి

ధరణి పోర్టల్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు.

Published : 30 May 2023 14:57 IST

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణిని అడ్డుపెట్టుకుని చేస్తున్న అక్రమాలపై కమిటీ వేశామని తెలిపారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న రైతులను మభ్యపెట్టడానికి భారాస అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ధరణి దందాలు నడుస్తున్నాయని కోదండరెడ్డి ఆరోపించారు. భారాస ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల 52మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. ధరణి దేశంలోనే ఒక పెద్ద కుంభకోణంగా మారిందని.. దీని ద్వారా  భారాస నేతలకు రూ.లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని