పండుగలా దశాబ్ది ఉత్సవాలు: డీపీఓ
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
మాట్లాడుతున్న జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్
పరిగి, న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అన్ని పంచాయతీ కార్యాలయాలను మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని చెప్పారు. జాతీయ జెండాను ఆవిష్కరించాలని అనంతరం పల్లె ప్రగతి ద్వారా గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామస్థులకు జరిగిన లబ్ధిని, ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల వివరాలను ప్రకటించాలని సూచించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దీపారెడ్డి, మండలాధ్యక్షుడు అరవింద్‌రావు, మండల అభివృద్ధి అధికారి శేషగిరిశర్మ, పంచాయతీరాజ్ డీఈఈ సుదర్శన్‌రెడ్డి, మండల పంచాయతీ అధికారి దయానంద్, ఈజీఎస్ ఏపీఓ ఉష, సర్పంచులు, మండల ప్రాదేశిక సభ్యులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.