logo

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు

చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమ రంగాలకు లక్ష్యం మేరకు రుణాలను పంపిణీ చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ బ్యాంకర్లును ఆదేశించారు.

Published : 31 May 2023 02:43 IST

వార్షిక ప్రణాళికను విడుదల చేస్తున్న రాహుల్‌శర్మ

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమ రంగాలకు లక్ష్యం మేరకు రుణాలను పంపిణీ చేయాలని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ బ్యాంకర్లును ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లు, డీసీసీ, డీఎస్‌ఆర్‌సీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమ రంగాలకు రుణాల పంపిణీలో ఇప్పటివరకు 19 శాతమే లక్ష్యం సాధించారని తెలిపారు. బ్యాంకర్లు పరిశ్రమలపై ప్రత్యేక శ్రద్ధను పెట్టి లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ప్రాధాన్యతా రంగాలకు 5692 కోట్లు లక్ష్యం కాగా 2858 కోట్ల రుణాలను పంపిణీ చేసి 50 శాతం లక్ష్యాన్ని సాధించారన్నారు. ఈ సందర్భంగా 2023-24 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ అర్థిక సంవత్సరానికి మొత్తం 7408 కోట్ల రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ సమావేశంలో ఎల్‌డీఎం రాంబాబు, జిల్లా అధికారులు చక్రపాణి, అనిల్‌కుమార్‌, రవికుమార్‌, శ్రీనివాస్‌, ఆర్బీఐ ఎల్‌డీఓ తేజ్‌దీప్‌ బెహర్‌, నాబార్డ్‌ డీడీఎం పీయూష్‌, ఎస్‌బీఐ ఆర్‌ఎం మధుబాబు, అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని