logo

ఎన్నాళ్ల కెన్నాళ్లకు..

భారాస ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తాండూరులోని ఏఐసీసీ సభ్యుడు రమేష్‌ మహరాజ్‌ను కలిశారు. జూన్‌7న తాండూరులో నిర్వహించే తమ స్వగృహ ప్రవేశానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు.

Published : 31 May 2023 02:43 IST

రమేష్‌ మహరాజ్‌కు ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు: భారాస ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తాండూరులోని ఏఐసీసీ సభ్యుడు రమేష్‌ మహరాజ్‌ను కలిశారు. జూన్‌7న తాండూరులో నిర్వహించే తమ స్వగృహ ప్రవేశానికి రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో రోహిత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ సీటు రావడానికి రమేష్‌ మహరాజ్‌ కీలక భూమిక పోషించారు. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగానే పోటీ చేసి, భారాస అభ్యర్థి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడి భారాసలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరూ కలుసుకున్నదే లేదు. తాజాగా రోహిత్‌రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని