కొబ్బరి నీళ్లు.. నిమ్మరసం.. ఓఆర్‌ఎస్
ఎండ, ఉక్కపోతతో నీరు చెమట రూపంలో శరీరం నుంచి బయటకు పోతోంది. కాసేపు ఎండలో ఉంటే నోరు, గొంతు తడారిపోతుంటాయి. దీంతో నీళ్లు అధికంగా తాగాలనిపిస్తుంది.
ఎండ, ఉక్కపోతతో నీరు చెమట రూపంలో శరీరం నుంచి బయటకు పోతోంది. కాసేపు ఎండలో ఉంటే నోరు, గొంతు తడారిపోతుంటాయి. దీంతో నీళ్లు అధికంగా తాగాలనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులు తప్ప మిగతా వారు రోజూ 4-5 లీటర్ల నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
* నీటితో పాటు సోడియం, పొటాషియం చెమట రూపంలో బయటకు పోతుంటాయి. నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. కేవలం నీటినే తీసుకోవడం వల్ల వాటిని తిరిగి భర్తీ చేయలేం.
* కేవలం నీళ్లు మాత్రమే కాకుండా ఉప్పు, కొంచెం చక్కెర కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల సోడియం, పొటాషియం ఇతర లవణాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి.
* రోడ్ల పక్కన దొరికే నిమ్మరసం, ఐస్ క్రీమ్‌లు, ఐస్‌పై వేసి అమ్మే పుచ్చకాయ ముక్కలు ఇతర చల్లని పదార్థాలు తీసుకోవడం సహజమే. నాణ్యతలేని ఐస్‌తో తయారు చేసే పదార్థాలు, ద్రవాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తించాలి.
* మసాలాలు, వేపుళ్లు, ఉప్పు పదార్థాలను తక్కువ తీసుకోవాలి. అధిక ఉప్పుతో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఈ సమయంలో ఎండలోకి వెళ్తే వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. నీటి శాతం అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
* ఏసీల్లో ఉండే వారు 3-4 లీటర్లు, ఎండలోకి పనికి వెళ్లే వారు 4-5 లీటర్ల ద్రవపదార్థాలు తీసుకోవాలి. ఎండలో పని చేసే వారు ఉప్పు, పంచదార కలిపిన నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. దీంతో చెమట రూపంలో శరీరం కోల్పోయిన లవణాలన్నీ తిరిగి శరీరానికి అందించొచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం.. నేడు శంకుస్థాపన చేయనున్న నరేంద్ర మోదీ
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్