logo

Hyderabad: సెంట్రల్‌ హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలు

పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా కన్పించే ఆకాశహర్మ్యాల పోకడ సెంట్రల్‌ హైదరాబాద్‌కూ విస్తరిస్తోంది. ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న ఆబిడ్స్‌, చుట్టుపక్కల కొత్త నిర్మాణాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.

Updated : 01 Jun 2023 09:57 IST

నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న పదంతస్తుల పార్కింగ్‌ సముదాయం ఎలివేషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా కన్పించే ఆకాశహర్మ్యాల పోకడ సెంట్రల్‌ హైదరాబాద్‌కూ విస్తరిస్తోంది. ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉన్న ఆబిడ్స్‌, చుట్టుపక్కల కొత్త నిర్మాణాలు ఒక్కొక్కటిగా వస్తున్నాయి.

* ఆబిడ్స్‌ ఎస్‌బీఐ బ్యాంకు ఎదురుగా దాదాపు ఎకరన్నర విస్తీర్ణంలో 40 అంతస్తుల్లో ఒక సంస్థ హైరైజ్‌ గృహ నిర్మాణ పనులను చేపట్టింది. ఇప్పటికే నాలుగైదు అంతస్తులు పూర్తయ్యాయి.

* మొజంజాహి మార్కెట్‌ సమీపంలో మరో సంస్థ 20 అంతస్తులతో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి పొందింది. 1.87 ఎకరాల ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం రాబోతుంది.

* ఇప్పటికే నాంపల్లిలో పదంతస్తుల్లో హైదరాబాద్‌ మెట్రోకు చెందిన బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయం నిర్మితమవుతోంది. పనులు పూర్తయితే ఎన్నికలకంటే ముందే ప్రారంభిస్తారు.

* ఆదర్శనగర్‌లో ప్రభుత్వం వేర్వేరు విభాగాల అధిపతుల కోసం జంట సౌధాలను నిర్మించే ప్రణాళికలో ఉంది.

* సెంట్రల్‌ హైదరాబాద్‌లో భాగమైన పంజాగుట్టలో ఓ భారీ వాణిజ్య భవనం పనులు ఇప్పటికే పూర్తికాగా గృహ నిర్మాణ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి.

* బేగంపేటలోనూ ఒక హైరైజ్‌ వాణిజ్య నిర్మాణ పనులు ఇటీవల పూర్తయ్యాయి. ఇన్నాళ్లుగా ఖాళీగా ఉన్న స్థలాలను కొన్ని సంస్థలు కొనుగోలు చేసి వీటిని నిర్మిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని