logo

దశాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి: కలెక్టర్‌

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 01 Jun 2023 02:40 IST

సమావేశంలో మాట్లాడుతున్న నారాయణరెడ్డి

వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు వేడుకల నిర్వహణపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, శిక్షణ కలెక్టర్‌ నారాయణ అమిత్‌లతో కలిసి సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈనెల 2న జిల్లా కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ ఛైర్మన్‌ బి. వినోద్‌కుమార్‌ పతాకావిష్కరణ చేస్తారన్నారు. అన్ని మండల కేంద్రాల్లో, పురపాలక సంఘాల్లో పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. 3న రైతు దినోత్సవాన్ని జిల్లాలోని 99 రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించాలన్నారు.  4న సురక్ష దినోత్సవం, 5న విద్యుత్తు విజయోత్సవం, 8న ఊరూరా చెరువుల పండగ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అన్ని సబ్‌స్టేషన్లను 21 రోజుల పాటు విద్యుత్తు దీపాలతో అందంగా అలకరించాలన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 4న సురక్ష దినోత్సవంతో పాటు 12న తెలంగాణ రన్‌ కార్యక్రమాన్ని పోలీసు శాఖ విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా అధికారులు కోటాజీ, చక్రపాణి, గోపాల్‌, కృష్ణన్‌, తరుణ్‌కుమార్‌, బాబుమోజెస్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని