logo

Cheating-Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బిడ్డ పుట్టాక మోసం

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి, బిడ్డ పుట్టిన తర్వాత మోసం చేసిన ఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Published : 01 Jun 2023 08:30 IST

శంకర్‌పల్లి, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి, బిడ్డ పుట్టిన తర్వాత మోసం చేసిన ఘటన శంకర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం..శంకర్‌పల్లి మండలం శ్రీరామ్‌నగర్‌ కాలనీ మహాలింగాపురానికి చెందిన నర్సింహారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. ఓ కళాశాలలో బీటెక్‌ చదివే యువతి అతడితో స్నేహంగా ఉండేది. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేశాడు. ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చింది. స్థానికంగా ఉండలేక ఆ యువతి.. నాలుగు రోజుల క్రితం ఎల్బీనగర్‌లోని తన చిన్నమ్మ ఇంటికి సమీపంలోని ఓ గదిలో ఉంటోంది. సమాచారం తెలుసుకున్న కార్తీక్‌రెడ్డి, ఆయన తండ్రి నర్సింహారెడ్డితో కలిసి అక్కడకు వెళ్లారు. యువతిని బెదిరించి బిడ్డను ఎవరికైనా ఇచ్చేయమని చెప్పాడు. డీఎన్‌ఏ టెస్టు చేయించి కార్తీక్‌రెడ్డే తండ్రి అని తేలితే, పెద్ద కుమారుడి పెళ్లాయ్యాక, వివాహం చేస్తానని కార్తీక్‌రెడ్డి తండ్రి చెప్పాడు. మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని