logo

నిరంతర వెలుగు.. ఉపాధి మెరుగు

వారంలో మూడు రోజులు పరిశ్రమలకు పవర్‌ హాలిడే.. కొన్నిసార్లు నాలుగు రోజుల వరకు కరంట్‌ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. 2014 జూన్‌ 2 తెలంగాణ ఏర్పడే నాటికి నగరంలో కరెంట్‌కు కటకటలాడే దుస్థితి.

Published : 02 Jun 2023 03:11 IST

రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల అలంకరణలో గోల్కొండ కోట, విద్యుత్‌ సౌధ

ఈనాడు, హైదరాబాద్‌: వారంలో మూడు రోజులు పరిశ్రమలకు పవర్‌ హాలిడే.. కొన్నిసార్లు నాలుగు రోజుల వరకు కరంట్‌ ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. 2014 జూన్‌ 2 తెలంగాణ ఏర్పడే నాటికి నగరంలో కరెంట్‌కు కటకటలాడే దుస్థితి. చాలావరకు చిన్న, సూక్ష్మ, లఘు పరిశ్రమలు మూతపడ్డాయి. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్తుపై దృష్టిపెట్టింది. దీంతో గత 9 ఏళ్లలో పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకుంది. కొత్త పరిశ్రమల వెల్లువ మొదలైంది. నెట్‌వర్క్‌ అభివృద్ధికి దాదాపు రూ.8వేల కోట్లు ఖర్చు చేసినట్లు విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. 2015 నుంచి 2022 వరకు కొత్త పరిశ్రమల ఏర్పాటులో మేడ్చల్‌-మల్కాజిగిరి రాష్ట్రంలోనే 3805 యూనిట్లతో మొదటిస్థానంలో నిల్చింది. రూ.12873 కోట్ల  పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా 96,624 మందికి ఉపాధి లభించింది.

* కొత్త యూనిట్ల ఏర్పాటులో రంగారెడ్డి జిల్లా నాలుగో స్థానంలో నిల్చింది. ఇక్కడ 1137 పరిశ్రమలు వచ్చాయి. రూ.16,240 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. 1.60 లక్షల మందికి ఉపాధి కల్పనతో ద్వితీయస్థానాన్ని దక్కించుకుంది.

* సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులో హైదరాబాద్‌ జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. ఇక్కడ 2022 జనవరి నాటికి 48,224 యూనిట్లు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు