కారును ఢీకొన్న లారీ
మరో 20 నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకుంటారు.. కుటుంబ సభ్యులతో అప్యాయంగా ఉండాల్సిన వారు రోడ్డుపై విగత జీవులుగా మారారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని వస్తున్నా వారిని లారీలు మృత్యుపాశలై కబలించాయి.
భార్యాభర్తలు, కుమారుడు మృతి
మరో కుమారుడికి గాయాలు
కొణిజర్ల, న్యూస్‌టుడే: మరో 20 నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకుంటారు.. కుటుంబ సభ్యులతో అప్యాయంగా ఉండాల్సిన వారు రోడ్డుపై విగత జీవులుగా మారారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఇంటి దగ్గర కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని వస్తున్నా వారిని లారీలు మృత్యుపాశలై కబలించాయి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం, ఒకరు తీవ్రగాయాలతో బయటపడటం తీవ్ర విషాదాన్ని నింపింది. వైరా మండలం విప్పలమడకకు చెందిన పారుపల్లి రాజేశ్(40) హైదరాబాద్‌లోని ఓ ఫార్మసీ సంస్థలో పని చేస్తున్నాడు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భార్య సుజాత(35), పిల్లలు దివ్యజిత్, అశ్విత్(10) తీసుకుని స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుదామని కారులో బయలుదేరాడు. కొణిజర్లలోని పెట్రోలు బంకు వద్దకు రాగానే ఓ ట్యాంకర్ మరమ్మతుల నిమిత్తం రహదారి పక్కన నిలిపి ఉంది. దానిని చూసిన లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వీరి వాహనాన్ని కూడా వేగం తగ్గించారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన మరో లారీ కారును వేగంగా ఢీకొట్టింది. దీంతో కారు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయి నుజ్జయింది. వాహనాన్ని నడుపుతున్న రాజేశ్, వెనక సీటులో కూర్చొన్న భార్య సుజాత, చిన్నబాబు అశ్విత్ అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దబాబు దివ్యజిత్‌కు తీవ్ర గాయాలవడంతో ఖమ్మం తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో బెలూన్లు ఒపెన్ అయినప్పటికీ ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాణాలు కోల్పోయారు. ముందు సీటులో కూర్చొన్న పెద్దబాబు దివ్యజిత్ వైపు ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటంతో తీవ్రగాయాలతో బయటపడ్డాడు. మృతదేహాలను ఖమ్మం తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘నా పెద్ద కొడుకు’ అరెస్టుతో ఆకలి, నిద్ర ఉండడం లేదు
-
50 కిలోల తాబేలుతో గ్రామస్థుల పరార్..
-
నీళ్లు లేకుండానే పంట.. యువరైతు వినూత్న ఆవిష్కరణ
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..
-
TS TET Results: టెట్ ఫలితాలు నేడే.. రిజల్ట్స్ ఈనాడు.నెట్‌లో..
-
ఎఫ్ఐఆర్లో మొదట చంద్రబాబు పేరు లేదని విన్నా..: కేంద్ర మంత్రి నారాయణస్వామి