ఆరోగ్యభాగ్యం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగరంలో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు సమకూరాయి. గాంధీ, ఉస్మానియాలో రూ.కోట్లతో కొత్త పరికరాలు కొనుగోలు చేశారు.
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగరంలో ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు సమకూరాయి. గాంధీ, ఉస్మానియాలో రూ.కోట్లతో కొత్త పరికరాలు కొనుగోలు చేశారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయి. ప్రస్తుతం నిలోఫర్, పేట్లబుర్జు, కోఠి తదితర ప్రసూతి ఆసుపత్రుల్లో పేద మహిళలు పురుడు పోసుకుంటున్నారు. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి దాదాపు 60-70 వేల మందికి ప్రాణదానం చేసింది. గతంలో ఐసీయూ, ఆక్సిజన్ పడకల కొరత తీవ్రంగా ఉండేది. కరోనా తర్వాత గాంధీలో దాదాపు అన్ని పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించారు. మరో 600 ఐసీయూ పడకలు అందుబాటులోకి వచ్చాయి. ఉస్మానియాలో ప్రైవేటు ఆసుపత్రులతో పోటీపడి మరీ మోకీళ్ల మార్పిడి చికిత్సలు చేస్తున్నారు. ఇప్పటికే 200 మందికి ఈ చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు.
అందుబాటులో వైద్యం: గతంలో నగరంలో 85 వరకు పట్టణ ఆరోగ్య కేంద్రాలుండేవి. పెరుగుతున్న జనాభాకు ఇవి సరిపోక పోవడంతో 250 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తెచ్చారు. మరో 50 ఏర్పాటుకానున్నాయి. తెలంగాణ డయోగ్నోస్టిక్ సెంటర్‌తో 150కి పైగా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు గచ్చిబౌలి, ఎల్‌బీనగర్, ఆల్వాల్, ఎర్రగడ్డలో ఒక్కోటి వేయి పడకలతో రూపుదిద్దుకోనున్నాయి. ఇందుకు ప్రభుత్వం రూ.2679 కోట్లు వెచ్చిస్తోంది.
సేవల విస్తరణ: నిమ్స్‌లో చాలా ఏళ్లుగా పడకలు చాలక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రూ.1571 కోట్లతో నిమ్స్‌ను విస్తరిస్తున్నారు. దీంతో ఆసుపత్రి సామర్థ్యం 3500 పడకలకు పెరగనుంది. గాంధీలో రూ.100 కోట్లతో తల్లిబిడ్డలకు 100 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. క్యాన్సర్ ఆసుపత్రిలో కూడా అధునాతన పెట్‌స్కాన్, 8మాడ్యులర్ థియేటర్లు సిద్ధం చేశారు. వెరసి.. రాష్ట్రం ఏర్పాటైన ఈ పదేళ్లలో నగర వైద్య ముఖచిత్రం పూర్తి మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం