కొత్త కలెక్టరేట్‌లో వేడుకలకు ఏర్పాట్లు
పదేళ్ల ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను నిర్వహించేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో ఏర్పాట్లను పూర్తి చేసింది. కొంగరకలాన్‌లో జిల్లా కార్యాలయం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ వేడుకలు జరగనున్నాయి
ప్రాంగణంలో ప్రచార బెలూన్
ఆదిభట్ల: పదేళ్ల ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలను నిర్వహించేందుకు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే కలెక్టరేట్‌లో ఏర్పాట్లను పూర్తి చేసింది. కొంగరకలాన్‌లో జిల్లా కార్యాలయం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద మంత్రి సబితారెడ్డి నివాళులర్పిస్తారు. ఉదయం 9 గంటలకు కొత్త కలెక్టరేట్ ప్రాగణంలో జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం జిల్లా సంక్షేమంపై ఆమె ప్రసంగిస్తారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, వందన సమర్పణతో తొలిరోజు వేడుకలు ముగియనున్నాయి.
ఘనంగా నిర్వహించండి
ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. గురువారం రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు ప్రతీక్‌జైన్, తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియలతో కలిసి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరీశ్ మాట్లాడుతూ.. కొంగరకలాన్‌లోని కలెక్టరేట్‌లో జిలాస్థాయి వేడుకలు జరగనున్నాయన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో పొరపాట్లు జరగకుండా పతాకావిష్కరణ చేయాలన్నారు. 3న ప్రతి గ్రామంలో రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.
జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ శుభాకాంక్షలు
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యా మంత్రి సబితారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ జిల్లా ప్రజలకు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అలుపెరగని పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో స్వరాష్ట్రం సిద్ధించిందన్నారు. ప్రజల అకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు