logo

Hyderabad: రూ.2 వేల నోట్లతో ఒకటో తేదీనే వేతనాలు

భారీ మొత్తంలో రూ.2 వేల నోట్లు ఉన్నవారు మార్చుకోవడానికి, వాటిని వదిలించుకోవడానికి కొంగొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు.

Updated : 02 Jun 2023 10:54 IST

చిరుద్యోగులకు ఇచ్చి నోట్ల మార్పిడికి యజమానుల యత్నం

ఈనాడు, హైదరాబాద్‌: భారీ మొత్తంలో రూ.2 వేల నోట్లు ఉన్నవారు మార్చుకోవడానికి, వాటిని వదిలించుకోవడానికి కొంగొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లపై దృష్టి పెట్టగా తాజాగా వేతనాల రూపంలో ఇచ్చేస్తున్నారు. ఐదు, ఆరు తేదీల్లో వేతనాలిచ్చేవారు సైతం ఒకటో తేదీన సిబ్బందికి రూ.2వేల నోట్ల రూపంలో వేతనాలు ఇచ్చి స్వామి కార్యం స్వకార్యం పూర్తయిందని చేతులు దులిపేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతినెలా నాలుగు, ఐదో తేదీల్లో వేతనాలు ఇస్తుండగా మే నెల జీతం జూన్‌ ఒకటో తేదీనే ఇవ్వడంతో ముందే ఇస్తున్నారన్న సంతోషంతో వాటిని తీసుకున్నామని ఆ ఉద్యోగులు చెబుతున్నారు. మరికొందరు వేతనం రూ.10వేలు ఉంటే రూ.20వేలు చేతిలో పెట్టి మరో పదివేలు బ్యాంకులో మార్చుకొని రావాలని ఆదేశిస్తున్నారని తెలిపారు. ఇలా జూన్‌ 1న నగరంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని