Telangana Formation Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు

తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

Updated : 02 Jun 2023 10:06 IST

హైదరాబాద్‌: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అమరవీరులు చేసిన కృషి.. ఈ పదేళ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించిన విజయాలను గుర్తుచేసుకున్నారు.  

తెలంగాణ శాసనసభ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి వద్ద ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. సిరిసిల్ల కలెక్టరేట్‌ వద్ద కేటీఆర్‌, సిద్దిపేటలో హరీశ్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ దశాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు. కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌, నిజామాబాద్‌లో ప్రశాంత్‌రెడ్డి, జనగామలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, మెదక్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వనపర్తిలో నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌గౌడ్‌, సరూర్‌నగర్‌లో సబితా ఇంద్రారెడ్డి, సంగారెడ్డిలో మహమూద్‌ అలీ, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబాబాద్‌లో సత్యవతిరాథోడ్‌, మేడ్చల్‌ మున్సిపల్‌  కార్యాలయం వద్ద మల్లారెడ్డి జాతీయ పతాకాలను ఎగురవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని