logo

సమష్టి కృషితోనే ఉత్సవాలు విజయవంతం

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని సముదాయంలో ఆయన సమావేశం నిర్వహించారు.

Updated : 03 Jun 2023 01:24 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి, చిత్రంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ

వికారాబాద్‌టౌన్‌,న్యూస్‌టుడే: రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్‌ కార్యాలయంలోని సముదాయంలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమష్టి కృషితో ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. శనివారం నిర్వహించే రైతు దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలను సమీకరించి తరలించాలన్నారు. రైతు వేదికల్లో వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించే పోస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. 99 రైతు వేదికలను అందంగా అలంకరించే బాధ్యత వ్యవసాయశాఖ అధికారులదేనని చెప్పారు. ప్రజలకు సరిపడా తాగునీరు షామియానాలు, కుర్చీలు సమకూర్చాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌, నారాయణ అమిత్‌, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు