logo

ఉద్యమకారులకు తగిన న్యాయం

తెలంగాణ రాష్ట్రం సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌ అన్నారు.

Published : 03 Jun 2023 01:12 IST

సన్మానం అనంతరం ఉద్యమకారులతో బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌

వికారాబాద్‌టౌన్‌,న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం కల్పించి న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని బీసీ కమిషన్‌ సభ్యులు శుభప్రద్‌పటేల్‌ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. జిల్లా వీడీడీఎఫ్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ఛైర్మన్‌ విజయ్‌కుమార్‌, బార్‌అసోసియేషన్‌ మాజీ అధ్యక్షులు, భాజపా నాయకులు మాధవరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు జాఫర్‌ తస్వర్‌అలీ, టీఎల్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు