Hyderabad Metro: మాకూ మెట్రో రైల్ కావాలి
హైదరాబాద్ మెట్రోరైల్ సౌకర్యం తమ ప్రాంతాలకు కావాలంటూ రంగారెడ్డి, మేడ్చల్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థిస్తున్నారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్‌చెరు మార్గాల్లో మెట్రోరైల్ ప్రాజెక్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
మంత్రి కేటీఆర్‌కు ప్రజాప్రతినిధుల అభ్యర్థనలు
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైల్ సౌకర్యం తమ ప్రాంతాలకు కావాలంటూ రంగారెడ్డి, మేడ్చల్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను అభ్యర్థిస్తున్నారు. ఎల్బీనగర్-రామోజీ ఫిలింసిటీ, ఎల్బీనగర్-తుర్కయాంజాల్-ఆదిభట్ల-కొంగరకలాన్, ఉప్పల్-బోడుప్పల్-ఫిర్జాదీగూడ, మియాపూర్-పటాన్‌చెరు మార్గాల్లో మెట్రోరైల్ ప్రాజెక్టును వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
పర్యాటకం.. రాకపోకలకు అనుకూలం
మెట్రోరైల్ కారిడార్ ఎల్బీనగర్-మియాపూర్‌ను రామోజీ ఫిలింసిటీ వరకూ పొడిగించనున్నామని మంత్రి కేటీఆర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ మేరకు డీపీఆర్ తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలివ్వాలంటూ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు కేటీఆర్‌ను కోరారు. రామోజీ ఫిలింసిటీకి మైట్రోరైల్ సౌకర్యం కల్పిస్తే పర్యాటకంగా మరింత ఆదాయం వస్తుందని వారు మంత్రికి వివరించారు. మరోవైపు కొంగర్‌కలాన్ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల కార్యకలాపాలు ప్రారంభమైనందున సాగర్‌రింగ్‌రోడ్డు మీదుగా తుర్కయాంజాల్, ఆదిభట్ల కొంగర కలాన్‌కు మెట్రోరైల్ నడిపించాలని రంగారెడ్డి జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలు కోరారు.
* నాగోల్-రాయదుర్గం మెట్రోకారిడార్‌ను ఉప్పల్ నుంచి పీర్జాదిగూడ వరకూ పొడిగిస్తే ఐటీ రంగానికి ప్రయోజనమని, దీంతోపాటు పోచారం, పీర్జాదిగూడ, బోడుప్పల్ నుంచి ఉప్పల్ వరకూ ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
మరుగుదొడ్ల వినియోగానికి యూజర్ ఛార్జీలు:
మెట్రోరైలు స్టేషన్లలో మరుగుదొడ్ల వినియోగం ఇకపై ఉచితం కాదంటోంది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ. మూత్ర విసర్జనకు రూ.2, మరుగుదొడ్డి వినియోగానికి రూ.5 వసూలు చేసేందుకు ఏజెన్సీలకు అప్పగించింది. తొలుత కొన్నిస్టేషన్లలో యూజర్ ఛార్జీలను అమలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Visakhapatnam: విశాఖలో తెదేపా మెరుపు నిరసన
-
Rahul Gandhi: బిలాస్పూర్ To రాయ్‌పూర్.. ట్రైన్లో ప్రయాణించిన రాహుల్
-
Singer Damini: బయటకు వెళ్తే నా పరిస్థితేంటో అర్థం కావటం లేదు: దామిని
-
Chandrababu Arrest: తెదేపా ఓ కుటుంబం.. కార్యర్తలు మా బిడ్డలు: భువనేశ్వరి
-
King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!
-
Demat accounts: ఊరిస్తున్న మార్కెట్లు.. పెరిగిన డీమ్యాట్ ఖాతాలు