logo

ఆకాశ హర్మ్యాలు.. రహదారులు ఆర్థికాభివృద్ధికి చిహ్నాలు కాదు

ఆకాశహర్మ్యాలు.. సువిశాల రహదారులు ఆర్థికాభివృద్ధికి చిహ్నాలు కాదని, ఇతర రంగాలూ ఉండాలని హైకోర్టు జడ్జి జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి అన్నారు.

Published : 04 Jun 2023 03:22 IST

హైకోర్టు జడ్జి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కూకట్‌పల్లి: ఆకాశహర్మ్యాలు.. సువిశాల రహదారులు ఆర్థికాభివృద్ధికి చిహ్నాలు కాదని, ఇతర రంగాలూ ఉండాలని హైకోర్టు జడ్జి జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి అన్నారు. జేఎన్‌టీయూలో జరిగిన ‘మాదక ద్రవ్యాల వినియోగం- దుష్పరిణమాలు’అంశంపై ఉన్నతవిద్యామండలి, జేఎన్‌టీయూ, ధర్మసేవ ఛారిటబుల్‌ సంస్థ శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సమస్యల నుంచి తప్పించుకోవాలన్న దృక్పథం, స్నేహితుల ప్రోద్బలం వంటి కారణాలతో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గోవర్ధన్‌ రెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, రెక్టార్‌ గోవర్ధన్‌, ధర్మసేవ ఛారిటబుల్‌ సంస్థ సీఈవో జె.నిశాంత్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని