సైకిల్.. ఆరోగ్యకరం.. పర్యావరణహితం
ఆరోగ్యం, పర్యావరణంతో పాటు మహిళలు భద్రతకోసం సైకిల్‌ను విరివిగా వాడాలని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు.
డీజీపీ అంజనీకుమార్
సైకిళ్ల చెంత డీజీపీ అంజనీకుమార్, ఏజీ శిఖాగోయల్ తదితరులు
ఖైరతాబాద్, న్యూస్‌టుడే: ఆరోగ్యం, పర్యావరణంతో పాటు మహిళలు భద్రతకోసం సైకిల్‌ను విరివిగా వాడాలని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు. తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్(హెచ్‌సీజీ) సహకారంతో వరల్డ్ బైసైకిల్ డే సందర్భంగా శనివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో సైక్లోథాన్ జరిగింది. ‘రైడ్ సపోర్టు అండ్ ఎంపర్ ఏ గర్ల్’ థీమ్‌తో జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సిరిపుర ఉన్నత పాఠశాలకు చెందిన 30 మంది, వరంగల్ జిల్లా సంగెం మండలంలోని పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు. మహిళా భద్రత అదనపు డీజీపీ శిఖా గోయల్, హెచ్‌సీజీ సైక్లిస్టులు, విద్యార్థులతో కలిసి డీజీపీ సైక్లింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ‘తరుణి’ వ్యవస్థాపకురాలు డా.మమత రఘువీర్ అచంట, ఐఎఫ్‌ఎస్ విశ్రాంత అధికారి రఘువీర్ పాల్గొన్నారు. లీవ్ లైఫ్ ఫౌండేషన్, తెలంగాణ పోలీసు భద్రతా విభాగం, డికాదలాన్, ఫ్లబో ఫ్రెస్కో టీ సంస్థలు సహకారం అందించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ
-
Samantha: ఆ మూవీ లొకేషన్లో సమంత.. ఫొటోలు వైరల్