logo

నీటి ట్యాంకర్లకు మహా డిమాండ్‌

ఎండలు మండిపోతుండటంతో నగరంలో ఒక్కసారిగా తాగునీటికి డిమాండ్‌ పెరిగింది. నెల రోజుల్లో జలమండలికి ట్యాంకర్ల కోసం 73 వేలపైనే ఫోన్లు వచ్చాయి.

Published : 04 Jun 2023 03:28 IST

నెలరోజుల్లో 73 వేలపైనే బుకింగ్‌లు

ఈనాడు, హైదరాబాద్‌: ఎండలు మండిపోతుండటంతో నగరంలో ఒక్కసారిగా తాగునీటికి డిమాండ్‌ పెరిగింది. నెల రోజుల్లో జలమండలికి ట్యాంకర్ల కోసం 73 వేలపైనే ఫోన్లు వచ్చాయి. సాధారణ రోజుల్లో ఇవి 20-30 వేలకు మించవు.  కొన్ని డివిజన్ల నుంచి ఊహించనంతగా ఫోన్లు వచ్చాయని అధికారులు అంటున్నారు. ఎస్‌ఆర్‌నగర్‌ డివిజన్‌లో నెల రోజుల్లో 15 వేలకు పైగా ట్యాంకర్లను సరఫరా చేశారు. అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతాల్లో నివాసాలతోపాటు ఎక్కువగా వ్యాపార, వాణిజ్య సముదాయాలు  ఉండడంతో..తాగునీటి ట్యాంకర్లే దిక్కు.  రామచంద్రాపురం డివిజన్‌లోనూ 25 వేల బుకింగ్‌లు వచ్చాయి.  మంజీర, సింగూరు నీటి సరఫరా తగ్గడంతో ట్యాంకర్లకు ఎక్కువగా డిమాండ్‌ ఉంటోంది. కూకట్‌పల్లిలో 10 వేలపైనే బుకింగ్‌లు వచ్చాయి. చాలా ప్రాంతాల్లో తక్కువ ఒత్తిడితో సరఫరా చేస్తుండటం వల్ల అవసరాలకు తగ్గట్టు నీళ్లు రావడం లేదు. ట్యాంకర్ల కోసం వచ్చిన ఫోన్లలో 95 శాతం పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. ట్యాంకర్‌ బుక్‌ చేసుకున్న 24 గంటల్లోపే సరఫరా చేయాలి. కొన్నిసార్లు రెండు, మూడు రోజులూ పడుతోంది. గ్రేటర్‌లో 69 ఫిల్లింగ్‌ కేంద్రాలున్నాయి. ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో 10-20 ఫిల్లింగ్‌ కేంద్రాలను పెంచితే వేసవిలో ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని