logo

బడి బయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలి

బడి బయట ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని బడిబాట కార్యక్రమం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిశీలకులు, వయోజనవిద్య డైరెక్టర్‌ ఉషారాణి సూచించారు.

Published : 04 Jun 2023 03:41 IST

రాష్ట్ర వయోజన విద్య డైరెక్టర్‌ ఉషారాణి

చిన్నారి తండ్రికి ప్రవేశపత్రం అందిస్తున్నఉషారాణి, విద్యాశాఖ అధికారులు

తుర్కయంజాల్‌ పురపాలిక, న్యూస్‌టుడే: బడి బయట ఉన్న పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని బడిబాట కార్యక్రమం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిశీలకులు, వయోజనవిద్య డైరెక్టర్‌ ఉషారాణి సూచించారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం తుర్కయంజాల్‌ పురపాలిక మునగనూర్‌లోని మండల ప్రజా పరిషత్‌ పాఠశాలను సందర్శించి బడిబాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మున్సిపాలిటీలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశమై బడిబాట కార్యక్రమం ప్రాధాన్యాన్ని తెలియజేశారు. సమీప అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పైబడిన పిల్లలను ప్రభుత్వ బడుల్లో నమోదుచేయాలని వారిని కోరారు. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి తల్లిదండ్రుల ప్రమేయంతో వాటిని బలోపేతం చేయాలనీ సూచించారు. ఆ తర్వాత స్థానిక కౌన్సిలర్‌ స్వాతిరెడ్డితో కలిసి గ్రామంలో పర్యటించి బడిఈడు పిల్లలను పాఠశాలలో నమోదు చేయించారు. ఎంఈవో హీర్యానాయక్‌, ఎఫ్‌ఎల్‌ఎన్‌ మండల కోఆర్డినేటర్‌ రామచంద్రారెడ్డి, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి సిల్మానాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని