Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్‌

తెదేపాతో భాజపా పొత్తు ఉంటుందనే వార్తలపై భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనేది ఊహాగానాలే అని తెలిపారు.

Updated : 04 Jun 2023 17:20 IST

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో తెదేపాతో భాజపా పొత్తు ఉంటుందనేది ఊహాగానాలే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఊహాజనిత కథనాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను తెదేపా అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. గతంలో మమత, స్టాలిన్‌, నీతీశ్‌ కూడా మోదీ, అమిత్‌షాను కలిశారని గుర్తుచేశారు. ప్రతిపక్ష నేతలు, ప్రజలను కలవకుండా ఉండే పార్టీ భాజపా కాదని చెప్పారు. కేసీఆర్‌ మాదిరిగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ భాజపా కాదని సంజయ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని