logo

రైల్వే వంతెనకు రూ.92 కోట్లు

జిల్లా కేంద్రంలో నూతన రైల్వే వంతెన నిర్మాణ అవసరం గురించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చినట్లు వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ తెలిపారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 07 Jun 2023 04:11 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌ టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో నూతన రైల్వే వంతెన నిర్మాణ అవసరం గురించి సీఎం కేసీఆర్‌ దృష్టికి తెచ్చినట్లు వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ తెలిపారు. ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వంతెన ప్రస్తావన తెచ్చానని, దీనికి రూ.92 కోట్లు కేటాయించేందుకు సీఎం హామీ ఇచ్చారని ఆనంద్‌ తెలిపారు. అలాగే సంబంధిత శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో ఫోన్ల్‌ కేసీఆర్‌ మాట్లాడి వంతెన ఫైల్‌ను పంపించమని ఆదేశించినట్లు పేర్కొన్నారు. అనంతరం చీఫ్‌ సెక్రటరీ, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డితో వికారాబాద్‌లో జరగాల్సిన పలు అభివృద్ధి అంశాలపై మాట్లాడారన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు