నష్ట పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన
పరిశ్రమ నుంచి అదృశ్యమైన కార్మికుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత నెల 31న తన భర్త అదృశ్యం అయ్యాడని అతని భార్య శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
పరిశ్రమ వద్ద ధర్నా చేస్తున్న కార్మికుడి కుటుంబ సభ్యులు
పటాన్‌చెరు, న్యూస్‌టుడే: పరిశ్రమ నుంచి అదృశ్యమైన కార్మికుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గత నెల 31న తన భర్త అదృశ్యం అయ్యాడని అతని భార్య శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదేరోజు సాయంత్రం సమయంలో లింగంపల్లి-తెల్లాపూర్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడంటూ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహం తన భర్తదే అని శ్రీదేవి గుర్తించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో పరిశ్రమ గేటు ముందు కుటుంబసభ్యులు ధర్నా చేశారు. వారితో పరిశ్రమ ప్రతినిధులు చర్చలు జరిపారు. నిబంధనల మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Cheetah : భారత్‌కు ఉత్తర ఆఫ్రికా దేశాల చీతాలు.. పరిశీలిస్తున్న అధికారులు!
-
Sreeleela: వాటి ఎంపికలో జాగ్రత్తగా ఉంటా.. ఆ జానర్‌పై ఇష్టం పెరిగింది: శ్రీలీల
-
TS News: తెలంగాణలో కొత్త రెవెన్యూ డివిజన్లు .. నేటి నుంచి అమల్లోకి
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
CM Bungalow: కేజ్రీవాల్ అధికారిక నివాసం వివాదం.. రంగంలోకి CBI
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి