హరితం.. ధరణి దరహాసం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఈనెల 19న తొమ్మిదో విడత హరితోత్సవం నిర్వహించనున్నారు. ఆ మేరకు గ్రామ గ్రామాన మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొమ్మిదో విడతకు సన్నాహాలు
నర్సరీల్లో 72.59 లక్షల మొక్కల పెంపకం
న్యూస్‌టుడే, తాండూరు:
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జిల్లాలో ఈనెల 19న తొమ్మిదో విడత హరితోత్సవం నిర్వహించనున్నారు. ఆ మేరకు గ్రామ గ్రామాన మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారుల వెంబడి కూలీలు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతున్నారు. గత 8 విడతలుగా చేపట్టిన హరిత హారం వల్ల ఒనగూరిన ప్రయోజనాలను అధికారులు ప్రదర్శించబోతున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.
గతేడాది నవంబరు నుంచే శ్రీకారం
జిల్లాలో తొమ్మిదో విడత హరితహారాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు 25.47 లక్షల మొక్కలు పెంచారు. 566 గ్రామ పంచాయతీలకుగాను ఒక్కోదాన్లో ఏర్పాటు చేసిన నర్సరీలో 4,500 చొప్పున మొక్కల పెంపకం చేపట్టారు. గతేడాది నవంబరు నుంచే వీటి పెంపకానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా సేకరించిన ఎర్రమట్టి, పశువుల ఎరువు, ఇతర మిశ్రమ ఎరువులను కలగలిపి ఉపాధి కూలీలు పాలథిన్ కవర్లలో నింపారు. విత్తనాలు నాటి రోజువారిగా నీటిని పట్టారు. మొలకల నుంచి మొక్కలుగా ఎదిగేలా చేశారు. వీటి సంరక్షణకు జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు 1600 మంది కూలీలు పనులు నిర్వహించారు. ప్రస్తుతం నర్సరీల్లో ఉన్న వాటిలో నీడ నిచ్చే మొక్కలతో పాటు పండ్లు, పూల మొక్కలను పెంచారు. వీటిని హరితోత్సవం సందర్భంగా నాటనున్నారు.
ఆశాజనకంగా ఫలితాలు
జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన హరిత హారంలో నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా ఎదిగాయి. రహదారులకు ఇరువైపులా పెరిగినవి చల్లటి నీడనివ్వడమే కాదు ఆహ్లాదాన్ని సైతం పంచుతున్నాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు చల్లదనంగా మారేలా చేయడంతో పాటు కొత్త శోభను తెచ్చాయి. ఇక ఇళ్లలో నాటిన పండ్ల, పూల మొక్కలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనాలు భేష్
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. పండ్లు, పూలు, అలంకరణ మొక్కలతో పాటు నీడ నిచ్చేవి నాటి వృక్షాలుగా పెరిగేలా శ్రద్ధ వహించారు. యాదాద్రి మోడల్ ఫారెస్ట్ విధానాన్ని అనుసరించి ఒక ఎకరంలో 4000 మొక్కలు ఉండేలా చేశారు. ఆ మేరకు నాటినవి వృక్షాలుగా ఎదిగాయి.
మిగిలి పోయినవి కూడా..
జిల్లాలో ఇప్పటి వరకు 8 విడతలుగా హరిత హారం నిర్వహించారు. గ్రామాలతో పాటు ప్రభుత్వ సంస్థలు, ప్రధాన రహదారుల వెంబడి నాటగా నర్సరీల్లో లక్షల మొక్కలు మిగిలాయి. వీటిని అధికారులు సంరక్షించారు. 2022-23లో 20,32,686 మొక్కలు మిగిలాయి. అంతకు ముందున్న వాటి సంఖ్య 26,79,402. అన్నింటిని లెక్కిస్తే ప్రస్తుతం నాటేందుకు 47,12 లక్షలున్నాయి. కొత్తగా పెంచిన మొక్కలకు తోడు పాత మొక్కలు కలిపి నాటేందుకు 72.59 లక్షలు సిద్ధంగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Dulquer Salmaan: భీమ్స్ బీట్స్ విన్న ప్రతిసారి డ్యాన్స్ చేస్తున్నా: దుల్కర్ సల్మాన్
-
Viral video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
OBC census: ఓబీసీ గణన చేపట్టాల్సిందే..: మల్లికార్జున ఖర్గే డిమాండ్
-
BRS: భారాసలో చేరిన మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్
-
Kejriwal: సంజయ్ సింగ్ అరెస్టు.. మోదీలో భయాన్ని సూచిస్తోంది: కేజ్రీవాల్