Harish Rao: అందుకే మన ‘మిషన్ కాకతీయ’ దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు

‘ఊరూరా చెరువుల పండుగ’ను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా స్పందించారు. చెరువుల పునర్‌వైభవాన్ని ప్రస్తావిస్తూ వీడియో పోస్టు చేశారు.

Updated : 08 Jun 2023 10:41 IST

హైదరాబాద్: తెలంగాణ దశాబ్ది వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతోంది. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. అందులో భాగంగా ఇవాళ (జూన్ 8)న ‘ఊరూరా చెరువుల పండుగ’ను నిర్వహిస్తున్నారు. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. గోరటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా చెరువుల మీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు ఉంటాయి. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

‘ఊరూరా చెరువుల పండుగ’ను పురస్కరించుకొని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ..

‘‘నాడు ఎండి పోయిన చెరువులు.. నేడు నిండు కుండల్లా చెరువులు.. నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నం.. నేడు సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పునరుజ్జీవం.. అందుకే మన మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శం.. అమృత్ సరోవర్‌గా దేశ వ్యాప్తంగా అమలవుతోంది.. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’’ అని ట్విటర్‌ వేదికగా చెరువుల పునర్‌వైభవాన్ని ప్రస్తావిస్తూ వీడియో పోస్టు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని