logo

మరణంలోనూ వీడని స్నేహం

వారందరిదీ ఒకే ప్రాంతం.. చిన్ననాటి నుంచి కలిసే పెరిగారు.. కలిసే చదివారు.. కలిసే వ్యాపారం చేశారు.. ఓ రోడ్డు ప్రమాదం వారిని కబళించింది.

Published : 09 Jun 2023 02:10 IST

చిట్యాల రోడ్డు ప్రమాదంలో సనత్‌నగర్‌కు చెందిన ముగ్గురి దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం


ఆమేర్‌,                    యూసుఫ్‌,             నయీమ్‌

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: వారందరిదీ ఒకే ప్రాంతం.. చిన్ననాటి నుంచి కలిసే పెరిగారు.. కలిసే చదివారు.. కలిసే వ్యాపారం చేశారు.. ఓ రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సనత్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఆమేర్‌(50), యూసుఫ్‌(48), ఎర్రగడ్డశ్రీరామ్‌నగర్‌కు చెందిన నయీమ్‌(48)లు మరణించగా సలీం(52) తీవ్రంగా గాయపడ్డాడు. డీఎన్‌ఎం కాలనీకి చెందిన సయ్యద్‌ అమేర్‌, యూసుఫ్‌, సలీంలో ఒకే పాఠశాలలో చదివారు. ఎప్పుడూ కలిసే ఉండేవారు. కార్‌ కన్సల్టెన్సీ వ్యాపారం కలిసే చేస్తున్నారు.  నయీమ్‌ వీరి భాగస్వామిగా ఉన్నాడు. బుధవారం వ్యాపార రీత్యా స్కోడా కారులో విజయవాడ వైపు వెళ్లిన నలుగురూ.. పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి చిట్యాల వద్ద వీరి కారును లారీ ఢీకొట్టింది. ఆమేర్‌, యూసుఫ్‌, నయీమ్‌లు మృతి చెందారు. సలీం తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ఆమేర్‌కు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు, యూసుఫ్‌కు ఇద్దరు కుమారులున్నారు. గాయపడిన సలీంకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడున్నారు.
ఆమేర్‌ కుటుంబంలో తీవ్ర విషాదం: ఆమేర్‌ సోదరుడి కుమారుడు ఇర్ఫాన్‌ జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. తరువాత ఆమేర్‌ సోదరుడు సిరాజుద్దీన్‌ ఫిబ్రవరిలో అనారోగ్యంతో మరణించాడు. ప్రస్తుతం ఆమేర్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని